హాజీపూర్ తండా సమీపంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపై దాడి.. ఎల్లారెడ్డిలో కేసు నమోదు

ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది.

ఎల్లారెడ్డి పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం.. సెప్టెంబర్ 30న రాత్రి సుమారు 8 గంటల సమయంలో హాజీపూర్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికివేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారంతో విధి నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ అక్కడికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో హాజీపూర్ తండాకు చెందిన గంగారం, చందు, మరికొందరు వ్యక్తులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply