అక్టోబర్ 6న హైదరాబాద్ ఓయూలో మాదిగ విద్యార్థుల ప్రతినిధుల జాతీయ సదస్సు
బీర్కూర్: మాదిగ విద్యార్థుల ప్రతినిధుల జాతీయ సదస్సు అక్టోబర్ 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. సదస్సును విజయవంతం చేసేందుకు మండలాలు, కళాశాలల నుంచి మాదిగ విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించాలని ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్)ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సామ్యెల్ మాదిగ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మాదిగ విద్యార్థుల పాత్ర వివిధ రంగాల్లో చురుకుగా ఉండబోతుందని, అందుకు అనుగుణంగా ఎంఎస్‌ఎఫ్ సంస్థాగత నిర్మాణాలను బలోపేతం చేయాలని అన్నారు.
ఈ నేపథ్యంలో బీర్కూర్ మండల కేంద్రంలోని కళాశాలలో మాదిగ విద్యార్థులను కలిసి అక్టోబర్ 6న హైదరాబాద్‌లో జరిగే సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొనగా, నియోజకవర్గ పర్యవేక్షకులు మావురం శ్రీకాంత్, బోయి చిన్న సాయిలు మాదిగ, రాచకొండ కుమార్ మాదిగ, అనుమాండ్లు మాదిగ, శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.