సిరికొండ అటవీ ప్రాంతంలో 37 టేకు దుంగలు స్వాధీనం
సిరికొండ: అటవీ ప్రాంతంలో అక్రమంగా నరికిన 37 టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రావుట్ల సెక్షన్‌లోని మెట్టు తాండ ఫారెస్ట్ బీట్ పరిధిలో ఈ దుంగలను గుర్తించిన అధికారులు సిరికొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు.
కంపార్టుమెంట్ నంబర్ 394లో టేకు దుంగలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.68 వేలు ఉంటుందని సిరికొండ రేంజ్ అధికారి కె. నర్సింగరావు తెలిపారు.
దుంగలను నరికిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. అటవీ సంపదకు నష్టం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.