జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు బూమా పాల్ మృతి
జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు బూమా పాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నాయకుడు కొండల్ ముధిరాజ్ సంతాపం తెలిపారు.
•1 నిమిషం చదవాలిఅప్డేట్: September 8, 2026
జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు బూమా పాల్ మృతి
జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కోఆప్షన్ సభ్యుడు శ్రీ బూమా పాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు సమాచారం. ఆయన మృతిపై జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బాషావోని కొండల్ ముధిరాజ్ సంతాపం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం బూమా పాల్ చేసిన సేవలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని కొండల్ ముధిరాజ్ పేర్కొన్నారు.
బూమా పాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.
బూమా పాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ
ఓం శాంతి 🙏💐
సంతాపం వ్యక్తం చేసిన వారు: బాషావోని కొండల్ ముధిరాజ్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు.
తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ, సామాజిక ప్రాతినిధ్యంపై ప్రత్యేక చట్టం…