హరీష్‌రావు అరెస్ట్‌తో జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎస్‌ఓటీ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన
జవహర్‌నగర్‌లోని ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హకీంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్‌లను వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించిన నేపథ్యంలో హరీష్‌రావును జవహర్‌నగర్ ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి.
పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ గేట్లను నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులు ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేసినట్లు సమాచారం.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో జవహర్‌నగర్ ఎస్‌ఓటీ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జవహర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ కోఆప్షన్ సభ్యుడు బూమా పాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ నాయకుడు కొండల్ ముధిరాజ్…
తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం మూడవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ, సామాజిక ప్రాతినిధ్యంపై ప్రత్యేక చట్టం…