జవహర్ నగర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
జవహర్ నగర్ డివిజన్‌లో పడకంటి గౌతమికి ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతగాని శాంతికోటేశ్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దొంతగాని శాంతికోటేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పూరి గుడిసె లేని పరిస్థితి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు.
సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యువరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్ల వినయ్ కుమార్, ఎర్రగుండ్ల వెంకటేశ్వర్, మంద ఆనంద్, రమణ, శ్రీదేవి, లక్ష్మి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.