పోడు భూముల్లో బలవంతపు ప్లాంటేషన్ ఆపాలి | పవార్ వార్త
పవార్ వార్త
కామారెడ్డి జిల్లా ప్రత్యేక కథనం
🔴 తాజా జిల్లా వార్త

పోడు భూముల్లో బలవంతపు ప్లాంటేషన్ ఆపాలి

జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి.. పోడు రైతుల జోలికొస్తే తీవ్ర పరిణామాలు: సీపీఎం

గిరిజనులకు భూములు ఇవ్వకుంటే ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకుంటాం: వ్యవసాయ కార్మిక సంఘం
📍 కామారెడ్డి 📅 ఆగస్టు 22, 2026 📰 పవార్ వార్త 🏞️ పోడు భూముల సమస్య
గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు చేపడుతున్న బలవంతపు ప్లాంటేషన్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోడు భూముల సమస్యపై ఆందోళన తీవ్రతరమైంది. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. గిరిజనుల పోడు భూముల్లో వారి అనుమతి లేకుండా ప్లాంటేషన్ చేపట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గిరిజనులు వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను వారి నుంచి బలవంతంగా లాక్కోవడం సరికాదన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన గిరిజన రైతులు తమ జీవనాధారమైన భూములపైనే ఆధారపడి ఉన్నారని, అలాంటి భూముల్లో వారి అనుమతి లేకుండా అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ చేపట్టడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పోడు రైతుల జోలికొస్తే తీవ్ర పరిణామాలు

“పోడు రైతుల భూముల విషయంలో అధికారులు బలవంతపు చర్యలకు పాల్పడవద్దు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం.”

— కే. చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి

పోడు రైతుల భూముల విషయంలో అధికారులు బలవంతపు చర్యలకు పాల్పడవద్దని చంద్రశేఖర్ హెచ్చరించారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

అనంతరం ఆందోళనకారులు ఫారెస్ట్ అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బలవంతపు ప్లాంటేషన్‌ను నిలిపివేస్తామని ఫారెస్ట్ అధికారులు హామీ ఇచ్చినట్లు ఆందోళనకారులు తెలిపారు.

భూములు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ.. గిరిజనులకు వారి హక్కైన భూములను అందించాలని డిమాండ్ చేశారు.

గిరిజనుల సాగు భూముల సమస్యను పరిష్కరించకుండా అధికారులు బలవంతంగా ప్లాంటేషన్ చేపడితే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. గిరిజనులకు భూములు ఇవ్వకుంటే ఎర్రజెండాలు పాతి భూములను స్వాధీనం చేసుకునే స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

⚠️ ప్రధాన డిమాండ్లు

పోడు రైతుల జీవనాధారాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు కోరారు.

01. పోడు భూముల్లో బలవంతపు ప్లాంటేషన్ నిలిపివేయాలి
02. అర్హులైన గిరిజనులకు భూ హక్కులు కల్పించాలి
03. గిరిజనుల సాగు భూముల సమస్యను పరిష్కరించాలి
04. పోడు రైతుల జీవనాధారాన్ని రక్షించాలి

పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు

ఆందోళనలో పాల్గొన్న వారు
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, నాయకులు సుభాష్, రమేష్, గణేష్, సీట్యా, కమల, సరోజ, శారద తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిరిజనుల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన గిరిజనులకు భూ హక్కులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

పవార్ వార్త — ప్రజా సమస్యలపై ప్రత్యేక కథనాలు
© 2026 Pawar Vartha
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply