కామారెడ్డి జిల్లా బీబీపేట్: మండల కేంద్రం నుంచి తుజల్పూర్ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనాల కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను బీబీపేట్ తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్య తీవ్రత, ఇప్పటివరకు అధికారుల స్పందనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రోడ్డుపై వాహనాల రాకపోకల కారణంగా పైప్‌లైన్ నుంచి వస్తున్న తాగునీటిలో మురికి, క్రిమికీటకాలు కలిసే అవకాశం ఉందని నరసింహులు పేర్కొన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.

గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్‌అండ్‌బీ అధికారులు సమస్యపై వెంటనే స్పందించి పగిలిన పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే తాగునీరు కలుషితం కావడం వల్ల ఏదైనా ఇబ్బంది తలెత్తితే గ్రామపంచాయతీ, సంబంధిత ప్రభుత్వ అధికారులదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Sai Tarun yaswanth
Sai Tarun yaswanth పవార్ వార్త • సైట్ అడ్మిన్ ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply