BREAKING NEWS • మల్కాజిగిరి పోలీసుల కీలక రికవరీ 20 ఆగస్టు 2026
🔴 పోలీస్ • హైదరాబాద్

సీఈఐఆర్‌ పోర్టల్‌తో 1,834 సెల్‌ఫోన్ల రికవరీ!

పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ సాయంతో గుర్తించి రికవరీ చేయడంలో మల్కాజిగిరి పోలీసులు సఫలమయ్యారు.

📱
0 రికవరీ చేసిన ఫోన్లు
🏢
0 పోలీస్ స్టేషన్లు
📅
7 నెలలు రికవరీ ప్రక్రియ
🔎
CEIR ఫోన్ ట్రేసింగ్ పోర్టల్

🎥 ఘటనకు సంబంధించిన వీడియోలు

12 వీడియో క్లిప్స్

POLICE RECOVERY 1 / 12
పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్లను సీఈఐఆర్‌ పోర్టల్‌ సాయంతో గుర్తించి రికవరీ చేయడంలో మల్కాజిగిరి పోలీసులు సఫలమయ్యారు.

కమిషనరేట్‌ పరిధిలోని 29 పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఫోన్‌ మిస్సింగ్‌, చోరీ కేసుల్లో ఏడు నెలల్లో 1,834 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ సుమతి తెలిపారు.

ఉప్పల్‌లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

2026 ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటివరకు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఫోన్లను ట్రేస్‌ చేసి రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు.

గుర్తించిన ఫోన్లను పోలీస్‌స్టేషన్‌ల వారీగా సంబంధిత యజమానులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. పోగొట్టుకున్న ఫోన్‌ దొరికే వరకు రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇంకా రికవరీ కాని మొబైల్‌ఫోన్లను గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని సీపీ తెలిపారు.

🚔 పోలీస్‌స్టేషన్‌ల వారీగా ముఖ్యమైన రికవరీలు

ఉప్పల్‌ 256
హయత్‌నగర్‌ 150
చైతన్యపురి 143
వనస్థలిపురం 143
ఎల్‌బీనగర్‌ 129
జవహర్‌నగర్‌ 125

📱 ఫోన్ పోగొట్టుకున్నారా? వెంటనే ఇలా చేయండి

ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఆలస్యం చేయకుండా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, సీఈఐఆర్‌ పోర్టల్‌లో ఫోన్‌ వివరాలను నమోదు చేయాలని పోలీసులు సూచించారు.

01 సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి
02 ఫోన్‌ IMEI నంబర్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలు సిద్ధంగా ఉంచండి
03 CEIR పోర్టల్‌లో ఫోన్‌ వివరాలను నమోదు చేయండి
!
ముఖ్యంగా ఫోన్‌ IMEI నంబర్‌, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు అందుబాటులో ఉంటే ఫోన్‌ను గుర్తించడం సులభమవుతుందని పోలీసులు తెలిపారు. రికవరీ కాని ఫోన్లను గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply