ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.. రైతులను ఆదుకోవాలి: జాజాల సురేందర్

ధాన్యం కొనకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం: మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక

పవార్ వార్త, మోసన్‌పూర్: వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోసన్‌పూర్ గ్రామంలో రైతుల వడ్ల కల్లాల వద్ద ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు.

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

గ్రామంలో పర్యటించిన జాజాల సురేందర్ రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోయే పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. రైతాంగానికి న్యాయం జరిగేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైతులకు అండగా ఉంటామని భరోసా

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న జాజాల సురేందర్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోకపోతే రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి