నెల్లికుదురు PHC, జూనియర్ కళాశాలలో కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీ

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, సాధారణ ప్రసవాల ప్రోత్సాహం, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

మండలంలోని ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. షెడ్యూల్ ప్రకారం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యా సంస్థల్లో విద్యార్థులకు వంట చేసే సిబ్బందికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణీలు, పిల్లలు, బాలింతలకు సంబంధించిన టీకాలను క్రమం తప్పకుండా వేయాలని తెలిపారు. మాతా శిశు మరణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ మెడిసిన్ రిజిస్టర్లు, అటెండెన్స్ రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిధిలోని సబ్‌సెంటర్ల వారీగా మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, పిల్లలకు వ్యాక్సిన్లు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అందించాలని సూచించారు. బోద కాలు, గర్భ సంచీ క్యాన్సర్‌ల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు, సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రతి తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. వారి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై ప్రతి సబ్జెక్టుపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.

ఇంటర్మీడియట్ దశలోనే ప్రతి విద్యార్థి తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పూర్తిగా నమోదయ్యేలా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలని, ఇంగ్లీష్‌తో పాటు ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, నెల్లికుదురు తహసిల్దార్ నరేష్, కళాశాల ప్రిన్సిపల్ వీరస్వామి, ప్రాథమిక వైద్యశాల అధికారి తదితరులు పాల్గొన్నారు.

ఈ వివరాలను మహబూబాబాద్ జిల్లా డీపీఆర్వో కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply