బీబీపేటలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి: కొరివి నరసింహులు

బీబీపేట మండల కేంద్రంలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

బీబీపేట మీదుగా దుబ్బాక, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, రామాయంపేట తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని నరసింహులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో నిర్మించిన బస్టాండ్‌ను ఆధునీకరించి, ప్రతి బస్సుకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్, నంబర్ కేటాయించేలా సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. బస్సులు క్రమపద్ధతిలో నిలిచేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.

బీబీపేటకు రవాణా పరంగా ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని నరసింహులు విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా బీబీపేట అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

మినీ బస్టాండ్ ఏర్పాటుకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply