జర్నలిస్టులకు శిక్షణ తరగతులు.. ఏఐ వార్తల విషయంలో ఒకటికి రెండుసార్లు వెరిఫై చేయాలి
తెలంగాణలోని 23 జిల్లాల్లో సుమారు 22 వేల అక్రిడిటేషన్ కార్డులు ఉన్నట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు. శిక్షణ తరగతుల్లో క్రైమ్, సివిల్ తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 500 మందికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు.
టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఏఐ ద్వారా లభించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసిన తర్వాతే వార్తలు రాయాలని జర్నలిస్టులకు సూచించారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం నుంచి 75 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని సంబంధిత శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. ఆ ఉత్తర్వులను చూపించినప్పటికీ జర్నలిస్టుల పిల్లలకు సబ్సిడీ ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా పాలనా అధికారి పేర్కొన్నారు.
రెండు రోజుల శిక్షణ తరగతుల ద్వారా జర్నలిస్టులకు అవగాహన కలిగిందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ కూడా పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.