కుత్బుల్లాపూర్‌లో ప్రజల సమస్యలు విన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శనివారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మంచినీరు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు.
ప్రజలు వివరించిన కొన్ని సమస్యలపై కూన శ్రీశైలం గౌడ్ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.