సజ్జనపల్లి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిక
లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
లింగంపేట్ మండలం సజ్జనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పుట్టి పోచయ్య, వార్డు సభ్యులు లక్ష్మినారాయణ, దుర్గయ్య, మంత్రి పోచయ్య, సాయిలు, గోపాల్, రాములు, శ్రీను, బిక్షపతి, శంకర్, రాములు, శ్రీకాంత్, క్రిష్టయ్య, బన్ని, చిన్నప్పగారి గంగారాం, లచయ్యాల గంగారాం తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరంతా ఈ రోజు ఎల్లారెడ్డి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంపై విశ్వాసంతో బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.