షామీర్‌పేట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన: భక్తుల భద్రతకు ప్రాధాన్యం

షామీర్‌పేట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా షామీర్‌పేట చెరువు వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా, క్రేన్లు, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

నిమజ్జనానికి వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

పోలీసు, మున్సిపల్, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సుమతి అధికారులకు సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply