గార్ల మండలం జీవంజిపల్లిలో గణేష్ లడ్డూ వేలం: రూ.50,116కు మద్దోజ్ నరేష్ కుటుంబం కైవసం
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని జీవంజిపల్లిలో ప్రియదర్శిని యూత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ లడ్డూ వేలం పాట అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ నవరాత్రి ఉత్సవాలు గత 27 సంవత్సరాలుగా ప్రియదర్శిని యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి.
వినాయక చవితి రోజు నుంచి 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ లడ్డూ వేలం పాటలో మద్దోజ్ నరేష్ (ఫ్లెక్సీ) కుటుంబ సభ్యులు పాల్గొని, రూ.50,116కు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. గణనాథుడి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రియదర్శిని యూత్ మరియు యావన్మంది ప్రజలపై ఉండాలని వారు ఆ గణనాథుని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని యూత్ సభ్యులు, జీవంజిపల్లి గ్రామస్థులు, మహిళలు, పిల్లలు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ శోభాయాత్రను నిర్వహించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.