తిమ్మంపేట: ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోదుగు బాబు భార్య మోదుగు శ్రీలత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించిన లక్ష్మణ్ బాబు, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాటి కృష్ణ, కుర్బన్ అలీ, పప్పు వెంకటరెడ్డి, చిట్టి మల్ల సమ్మయ్య, మండల PACS వైస్ చైర్మన్ కాదబోయిన నరేందర్, PACS డైరెక్టర్ సిద్ధం శెట్టి లక్ష్మణరావు, మండల నాయకులు యాలవర్తి శ్రీనివాస్, నాగేశ్వరావు, ఫిరోజ్, గాదె శ్రీనివాస్ చారి, నరేందర్, రతన్ సింగ్, చిన్నపెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అలాగే కొత్త మల్లూరు అధ్యక్షుడు మునిగేలా సాంబుల్, నర్సింహులు, సాంబాశివారావు, సోషల్ మీడియా వారియర్ మునిగేలా నరేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.