నాగారం: MMC నాగారం పరిధిలోని సత్యనారాయణ కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ వాటర్ లీకేజీ కారణంగా ఓ ప్లాట్‌లో నీరు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను సత్యనారాయణ కాలనీ యునైటెడ్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ సభ్యులు సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జీవన్ రెడ్డి, TJS పార్టీ అధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం డ్రైనేజీ సమస్య పరిష్కారానికి పనులు చేపట్టినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
సమస్యపై స్పందించి చర్యలు తీసుకున్న నాయకులకు సత్యనారాయణ కాలనీ యునైటెడ్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ తరఫున సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నం రాజు శ్రీనివాస్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఎం. భద్ర నాయక్, ఉపాధ్యక్షులు జి. సాయిలు, బి.ఎస్. చంద్రశేఖర్, కే. వెంకటేష్, ఉమాశంకర్ గౌడ్, గోపాల్ రెడ్డి తదితర అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.