ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సమక్షంలో 14 మందికి పింఛన్ పత్రాల పంపిణీ

వెల్లుట్ల పేటలో 14 కుటుంబాలకు పింఛన్ భరోసా

పవార్ వార్త, వెల్లుట్ల పేట: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామానికి 14 నూతన పింఛన్లు మంజూరయ్యాయి. లింగంపేటలోని జీఎన్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు.
14 మందికి పింఛన్ పత్రాలు
వెల్లుట్ల పేట గ్రామానికి చెందిన 14 మంది అర్హులకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్, ఉపసర్పంచ్ రాజు యాదవ్, గ్రామ అధ్యక్షుడు పెంట అంజయ్య, వార్డు సభ్యుడు కుమ్మరి సత్యనారాయణ పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి
గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన 14 మందికి పింఛన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి