మానవత్వానికి మరో నిదర్శనం.. 50 తులాల వెండి కడియాలు తిరిగి ఇచ్చేందుకు ముందుకొచ్చిన సర్పంచ్
వెండి కడియాలు ఎవరిదో తెలియదు.. ఆధారాలు చూపిస్తే అప్పగిస్తా!
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, వెలుట్లపేట: కారులో ప్రయాణించిన గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 50 తులాల కాళ్ల వెండి కడియాలను మరిచిపోయారు. వాటిని సొంతం చేసుకోకుండా అసలు యజమానికి తిరిగి అందించేందుకు వెలుట్లపేట సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ ముందుకొచ్చారు.
యజమాని ఎవరో తెలియక ప్రకటన

తాను కారులో ప్రయాణించే సమయంలో మానవత్వంతో చాలామందికి లిఫ్ట్ ఇస్తుంటానని వినోద రాజా గౌడ్ తెలిపారు. ఈ క్రమంలో తన కారులో ప్రయాణించిన వారిలో ఎవరో సుమారు 50 తులాల బంగారు కాళ్ల కడియాలను మరిచిపోయి వెళ్లినట్లు చెప్పారు. అయితే ఆ ఆభరణాలు ఎవరివి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు కారులో మరిచిపోయారనే వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు.
ఆధారాలు చూపిస్తే అప్పగిస్తా
విలువైన బంగారు ఆభరణాలు వాటి అసలైన యజమానికి చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులు ఆభరణాలకు సంబంధించిన సరైన గుర్తింపు వివరాలు, ఆధారాలు చూపించి తనను సంప్రదించాలని కోరారు.
ఆభరణాల యజమానులు 9949421727 నంబర్‌కు ఫోన్ చేయాలని కొయ్యల వినోద రాజా గౌడ్ సూచించారు. ఈ సమాచారం అసలైన యజమానులకు చేరేలా ప్రజలు సహకరించాలని కోరారు.
















