బిచ్కుందలో జై భవానీ గణేష్ మండలి లడ్డూ వేలం: రూ.28,011కు అర్జున్ కైవసం
బిచ్కుంద: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని భద్రాల్ తాండలో జై భవానీ గణేష్ మండలి ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా జరిగింది.
11 రోజులు పూజలు చేసిన గణపతి లడ్డూను భక్తులు పోటీపడి వేలం వేయగా, చివరకు రూ.28,011కు అర్జున్ దక్కించుకున్నారు. అదేవిధంగా సేపు పండు వేలం పాటలో రాథోడ్ గోవింద్ రూ.6,051కు, బాల గణేష్ లడ్డూను బట్టు హరి రూ.8,500కు, కలశాన్ని పవార్ వెంకట్ రూ.3,500కు తీసుకున్నారు.
ఈ సందర్భంగా 6వ వార్డు కౌన్సిలర్ తాండలోని మహిళలకు 50 చీరలను పంపిణీ చేశారు. 11 రోజుల పాటు గణేష్ మండలి వద్ద గణపతికి పూజలు చేసిన జాదవ్ శ్రీనివాస్ మహారాజ్‌ను సన్మానించారు. సేవలో పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరినీ ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జై భవానీ గణేష్ మండలి సభ్యులు, భద్రాల్ తాండ భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.