బిచ్కుందలో బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడిని పరామర్శించిన హన్మంత్ షిండే
బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు అల్లావోద్దీన్‌ను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. అల్లావోద్దీన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న హన్మంత్ షిండే ఆయన నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా అల్లావోద్దీన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న హన్మంత్ షిండే, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల మైనార్టీ నాయకులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.