ఎడపల్లి పీహెచ్‌సీని సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ ఐఏఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ముందుగా ఓపీ, ఐపీ సేవల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ డిస్పెన్సింగ్ రూమ్, ఫార్మసీ ప్రధాన స్టోర్‌ను పరిశీలించారు. మందుల నిల్వలు, గడువు తేదీలను తనిఖీ చేశారు. గడువు ముగిసే మందులను ముందుగానే గుర్తించి, వాటి వినియోగ గడువు తేదీలను స్పష్టంగా తెలియజేయాలని ఫార్మసిస్టును ఆదేశించారు.
అనంతరం ఓపీ రూమ్, ఐపీ వార్డులు, ల్యాబ్, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వాష్‌రూమ్‌లను పరిశీలించారు. ఆపరేషన్ రిజిస్టర్, హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు.
పీహెచ్‌సీ సూపర్‌వైజర్లు, సిబ్బందితో అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడారు. మునుపటి రోజు నిర్వహించిన విధులు, సిబ్బంది ఇంటి సందర్శనల సంఖ్య, ఏఎన్‌సీ, పీఎన్‌సీ ఫోన్ కాల్స్, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీ పరిధిలోని మండల, గ్రామ ప్రొఫైల్, ఆశా కార్యకర్తల పనితీరు, విధుల సమయాలు, ఆశా హాజరు రిజిస్టర్ల నిర్వహణపై వివరాలు సేకరించారు.
అదేవిధంగా ఎన్‌సీడీ సేవలు, జ్వర సర్వేలో పాల్గొంటున్న సిబ్బంది వివరాలు, వారి విధులు మరియు పని సమయాలు, గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా ఎల్‌ఎంపీ వివరాలు, అర్హత కలిగిన జంటల సంఖ్య, ప్రస్తుతం ఉన్న ఏఎన్‌సీ/పీఎన్‌సీ కేసుల సంఖ్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్‌సీలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అసిస్టెంట్ కలెక్టర్ సూచించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.