డి-46 కాలువ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలి: రైతులు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని డి-46 ఉపకాలువ చివరి ఆయకట్టు భూములకు సకాలంలో సాగునీరు అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఎడపల్లి, బోధన్ మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు బుధవారం బోధన్ నీటిపారుదల శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.
ప్రధాన కాలువ ద్వారా డి-46 ఉపకాలువకు సాగునీరు చేరుతుందని, ఈ కాలువ కింద ఎడపల్లి మండలంలోని ఎడపల్లి, దుబ్బతండా, బ్రాహ్మణపల్లి, బోధన్ మండలంలోని పెంటకలాన్, పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని రైతులు తెలిపారు.
ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ సకాలంలో సాగునీరు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. పంటలు కోత దశకు చేరుకునేలోపు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.
ఆకుల గోపాల్‌ను తిరిగి నియమించాలని డిమాండ్
డి-46 కాలువ పర్యవేక్షణ ఇన్‌స్పెక్టర్‌గా గతంలో పనిచేసిన ఆకుల గోపాల్‌ను తిరిగి అదే విధుల్లో నియమించాలని రైతులు డిమాండ్ చేశారు. తానకలాన్ గ్రామానికి చెందిన కొంతమంది రైతుల ఒత్తిడితో ఆయనను బదిలీ చేశారని రైతులు ఆరోపించారు. ఆయన బదిలీ తర్వాత డి-46 ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
డి-46 ఆయకట్టు రైతులకు సకాలంలో సాగునీరు అందేలా గతంలో విధులు నిర్వహించిన ఆకుల గోపాల్‌ను ఎడపల్లి మండలానికి తిరిగి విధుల్లోకి తీసుకురావాలని సంబంధిత నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారులను రైతులు కోరారు.
ప్రస్తుతం బోధన్ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆరోపించారు. డి-46 ఆయకట్టు కింద ఉన్న భూములకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఆకుల గోపాల్‌ను తిరిగి నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.