నాగారంలో ఘనంగా గణేష్ నవరాత్రులు.. మండపాన్ని సందర్శించిన కవిత
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా నాగారం ఓల్డ్ విలేజ్‌లో టీమ్ ఫ్రెండ్స్ యూత్ నాగారం అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి అధినేత కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై వినాయక మండపాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ నిర్వహించిన గణేష్ లేజర్ షోను ఆమె వీక్షించారు.
లేజర్ షో అద్భుతంగా ఉందని, వినాయకుడిని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగిందని కవిత అభిప్రాయపడ్డారు. గణనాథుడి వివిధ రూపాలను చూసినట్టుగా అనిపించిందని పేర్కొన్నారు.
గణేశుడి ఆశీస్సులు నాగారం ప్రజలపై, టీమ్ ఫ్రెండ్స్ యూత్ నాగారం అసోసియేషన్ నిర్వాహకులపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ముఖ్యఅతిథిగా కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంటూ గణేష్ కమిటీ సభ్యులను కవిత పేరు పేరున అభినందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.