గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
ఎల్లారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ గిరిజన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని విమర్శించారు. గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో బంజారాలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని, 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించామని నాయకులు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 42 తండాలకు చట్టబద్ధత కల్పించినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో రూ.9.20 కోట్లతో గిరిజన వసతి గృహాన్ని నిర్మించామని, తండాల్లో రూ.42 కోట్లతో బీటీ రోడ్లను నిర్మించిన ఘనత మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌దేనని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ గిరిజనులను ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని వారు ఆరోపించారు.
హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీం ఆదివాసీ భవన్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, గిరిజనుల కోసం సుమారు రూ.100 కోట్ల ఆస్తులు, రూ.25 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నాయకులు తెలిపారు.
అలాగే తండాలకు విద్యుత్ సదుపాయం, ఇంటింటికీ తాగునీరు, గురుకులాలు, వసతి గృహాల్లో విద్య, వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని వారు పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తండాల్లో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలు, వసతి గృహాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని వారు ఆరోపించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అసైన్‌మెంట్, పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ గిరిజన మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.