ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఎల్లారెడ్డిలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యతో పాటు వినయం, విలువలను అలవర్చుకుంటే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని వివరించారు.
అధ్యాపకులు సూచించిన విధంగా నడుచుకుంటూ చదువులో రాణిస్తే ఉన్నత విద్యలోనూ మంచి అవకాశాలు పొందవచ్చని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు కళాశాల అధ్యాపకులను బహుమతులు అందించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. చంద్రకాంత్, టీఎస్‌కేసీ సమన్వయకర్త శివకుమార్, సైన్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ బి. అరుణ్ కుమార్, నాగనిక, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దిరాజు, కృష్ణ ప్రసాద్, డాక్టర్ గోదావరి, శశిధర్, జి. రాణి, ఎస్. చంద్రకాంత్, సురేష్ రెడ్డి, సంగీత, స్వప్న, మహమూద్, నరేష్, లక్ష్మణ్, పవన్, వసంతలక్ష్మి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.