గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా నిలిచిన సయ్యద్ నబియా సుల్తానాకు సన్మానం
ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సయ్యద్ నబియా సుల్తానాను ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్–2025’లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచిన సందర్భంగా ఆమెను కమిటీ సభ్యులు అభినందించారు.
36 గంటల పాటు నిర్వహించిన ఈ హ్యాకథాన్‌లో నబియా సుల్తానా 2,089 మందితో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో భాగస్వామిగా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విజయంతో ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నబియా సుల్తానాను శాలువాతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ మీర్, ముక్రమ్ అలీ, ప్రధాన కార్యదర్శి అజీజుర్ రెహమాన్, జాయింట్ సెక్రటరీలు అహ్మద్ పాషా, హబీబ్ జానీ, కమిటీ సభ్యులు ఎండి నయీమ్, సమీర్, హఫీజ్ రఫీఖుల్లా తదితరులు పాల్గొన్నారు.