ఎల్లారెడ్డి 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 1వ వార్డులో రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, గత మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డులో ఇచ్చిన హామీ మేరకు షెడ్డు నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయించారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు భూమిపూజ నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు.
షెడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించినట్లు చైర్మన్ పేర్కొన్నారు.
1వ వార్డు సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, వార్డు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాదె తిరుపతి, నాయకులు శంకర్, చంద్రయ్య, శ్యాం, ప్యాలాల రాములు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.