గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసులు.. GO 317 బాధితుల ముట్టడి యత్నం
గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
GO 190ను అమలు చేయాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. బాధితుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
GO 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా జోన్‌కు బదిలీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.