జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యక్తి హత్య.. భార్య సహా ముగ్గురు అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండెల సంపత్ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధానికి సంపత్ అడ్డుగా ఉన్నాడనే కక్షతో ఈ హత్య జరిగినట్లు గణపురం పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సంపత్ భార్య సుమలత, ఆమె ప్రియుడు శ్రీకాంత్, మరో నిందితుడు తరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంపత్‌ను హత్య చేసేందుకు రూ.లక్ష సుపారీతో పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల ప్రకారం.. పథకంలో భాగంగా మద్యంలో పురుగుల మందు కలిపి సంపత్‌కు తాగించి హతమార్చినట్లు తెలిపారు. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
కేసును గణపురం పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.