డంపింగ్ యార్డు తొలగించకుంటే సీఎం కుర్చీ దించుతాం.. బాలుడి హెచ్చరిక
జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డుపై ఉధృతమైన ఉద్యమం
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, జవహర్‌నగర్: డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ జవహర్‌నగర్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 8వ రోజుకు చేరింది. యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, కాలుష్యంతో స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటానికి చిన్నారులు కూడా మద్దతు తెలుపుతున్నారు.
దీక్షా శిబిరంలో పాల్గొన్న పదేళ్ల బాలుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశాడు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడవద్దని, సమస్య పరిష్కరించకపోతే ప్రజలు కలిసి రాజకీయంగా తగిన సమాధానం చెబుతారని హెచ్చరించాడు. డంపింగ్ యార్డు కారణంగా చిన్నారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
జవహర్‌నగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌తో స్థానికులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఏళ్ల తరబడి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, తమ ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యార్డును తక్షణమే తరలించాలని నిరసనకారులు కోరుతున్నారు.
రిలే దీక్షలో ఆంజనేయులు, సోమయ్య, రాజు, సునీత, నందిని, రజిత, గణేష్, సత్యనారాయణ, రవి, రాము, సుజ్జి, యమున గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావాలి, కొన్నే వేణు, యాదగిరి, శ్రీనివాస్, సురేందర్, జయసుధ, నర్సన్న, మల్లేష్, జయ, రాజానర్సింహా, నాగరాజు, దర్గయ్య తదితరులు దీక్షా శిబిరానికి మద్దతు తెలిపారు.
డంపింగ్ యార్డు తరలింపుపై సంబంధిత అధికారుల స్పందన ఈ వార్త ప్రచురించే సమయానికి అందలేదు. యార్డును తొలగించాలన్న డిమాండ్‌తో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.













