మంచిర్యాల: దసరాకు పుట్టింటికి వెళ్లే విషయంలో మనస్తాపం.. మహిళ మృతి

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో ఓ మహిళ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో మనస్పర్థలు ఏర్పడిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

కాలనీకి చెందిన లావణ్య (32) రెండు రోజుల క్రితం తన తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి దసరా పండగకు ముందే పుట్టింటికి వస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా ఆయన అంగీకరించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.

మంగళవారం లావణ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఆమె తల్లి రాజేశ్వరి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా ఎస్సై తహిసీనొద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply