మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డైరెక్టర్ రాహుల్ రాజ్

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ (ఐఏఎస్) గారు మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీ విట్టల్ నాయక్, డైరెక్టర్ శ్రీ వేణుగోపాల్ తదితరులు డైరెక్టర్‌ను కలిశారు.

జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పనులపై డైరెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ అధికారులతో చర్చించారని తెలిపారు.

పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధికి అవసరమైన నూతన పనులకు మంజూరు, మరియు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (జేడీ) శ్రీ మల్లేశం, డీడీఎం శ్రీ ప్రసాద్ రావు, డీఎంఓ శ్రీ ఎం.డి. రియాజ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీ జాన్ వెస్లీ, అసిస్టెంట్ సెక్రటరీ మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారు తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి

WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply