SIR ప్రక్రియపై మేడ్చల్‌లో కాంగ్రెస్ నిరసన.. వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించవద్దని డిమాండ్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ దహనం
మేడ్చల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మేడ్చల్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించవద్దు: వజ్రెష్ యాదవ్
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.
SIR ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజీబ్ రుద్దీన్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు యాదవ్ పాల్గొన్నారు.
డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బాలు రెడ్డి, అధికార ప్రతినిధి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బీపీటీ రాజు, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డితో పాటు వివిధ ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
చాప రాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, శాంతి కోటేష్ గౌడ్, రామిడి సప్న విజయ్ రెడ్డి, భూమయ్య యాదవ్, ముప్పు రామారావు, బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, పోగుల దిలీప్ రెడ్డి, బొమ్మ కళ్యాణ్ పాల్గొన్నారు.
అలాగే మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, వెంకటేష్, తుంకి రమేష్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డితో పాటు యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, బీసీ సెల్, ఇతర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.