మేడ్చల్ నియోజకవర్గ చెరువుల అభివృద్ధికి నిధుల మంజూరుపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలం
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వజ్రెష్ యాదవ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రధాన చెరువుల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ రా చెరువు, చెంగిచెర్ల చింతల చెరువు, ఎదులాబాద్ చెరువు, రాంపల్లి సూర్యనారాయణ చెరువు, పీర్జాదిగూడ పెద్ద చెరువు తదితర చెరువుల ప్రస్తుత పరిస్థితి, పరిరక్షణ మరియు అభివృద్ధి అవసరాలను కమిషనర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, మేడ్చల్ నియోజకవర్గంలోని చెరువులను ఆక్రమణల నుంచి పరిరక్షించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, కట్టల బలోపేతం, నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.
తన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, సీఎం ఆదేశాల మేరకే హైడ్రా కమిషనర్‌ను కలిసి నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేసినట్లు వజ్రెష్ యాదవ్ పేర్కొన్నారు.
చెరువుల అభివృద్ధి పూర్తయితే వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.