లింగంపేట్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
లింగంపేట్‌లోని స్థానిక రైతు వేదిక భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉన్నతికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మండలంలోని 27 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు.
కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యారంగ అభివృద్ధికి తోడ్పడుతున్న 27 మంది ఉపాధ్యాయులను మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మానించినట్లు తెలిపారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మలహరి మాట్లాడుతూ సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట్ సర్పంచ్ కౌడ రవీందర్, ఉప సర్పంచ్ పోతగోని ప్రసాద్ గౌడ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వసుధ, శోభారాణి, కోటేశ్వరరావు, వహీద్ సిద్ధికి, ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, శేషయ్యతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, 150 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను సత్కరించిన తీరుపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.