నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా యూత్ పార్లమెంట్
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘యూత్ పార్లమెంట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి, రాణి రుద్రమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యువ ప్రతినిధులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పార్లమెంటరీ విధానాలు, చట్టసభల పనితీరు, నాయకత్వ లక్షణాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
యువత భావి భారత భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.