నాచారం సర్కిల్‌కు రూ.3.76 కోట్ల నిధులు మంజూరు.. అభివృద్ధి పనులకు శ్రీకారం
నాచారం సర్కిల్ పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులకు రూ.3.76 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కాలనీల వాసులకు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
నాచారం సర్కిల్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంలోనూ పరమేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ప్రస్తుతం సర్కిల్ పరిధిలోని కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తున్నారని కార్యక్రమంలో పేర్కొన్నారు.
వార్డ్ 18 – శక్తి సాయి నగర్ డివిజన్
- చాణిక్యపురి కాలనీ, దత్తాత్రేయ కాలనీ పార్క్ అభివృద్ధి పనులకు రూ.60 లక్షలు మంజూరు.
- బాబా నగర్, దత్తాత్రేయ నగర్‌లో సీసీ రోడ్డు పనులకు రూ.24.50 లక్షలు మంజూరు.
వార్డ్ 19 – హెచ్‌బీ కాలనీ డివిజన్
- అశోక్ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.28 లక్షలు మంజూరు.
వార్డ్ 20 – మల్లాపూర్ డివిజన్
- న్యూ భవాని నగర్‌లో శ్రీనివాస కిరాణా షాప్ లైన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.17.80 లక్షలు మంజూరు.
- భవాని నగర్‌లో ఇంటి నంబర్లు 3-2-63/2/p (64) నుండి 3-11-107/3 వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.24.60 లక్షలు మంజూరు.
- SV నగర్ బస్తీ దవాఖానా లైన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.14.80 లక్షలు మంజూరు.
- న్యూ భవాని నగర్‌లో ఇంటి నంబర్లు 3-2-63/2/260, 259 నుండి 3-1-16/125 వరకు రూ.21.80 లక్షలు మంజూరు.
వార్డ్ 21 – నాచారం డివిజన్
- రామ్ రెడ్డి నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.44.30 లక్షలు మంజూరు.
- హనుమాన్ నగర్, బాబా నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.42.80 లక్షలు మంజూరు.
- నాచారం న్యూ వార్డ్ ఆఫీస్ నుంచి భక్త సమాజ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.14.80 లక్షలు మంజూరు.
- భక్త సమాజ్ నుంచి నాచారం ఓల్డ్ విలేజ్ CDS వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.24.60 లక్షలు మంజూరు.
- సంస్కృతి హిల్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులకు రూ.44 లక్షలు మంజూరు.
వార్డ్ 22 – HMT డివిజన్
- అన్నపూర్ణ కాలనీ, ఐలా లిమిట్ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.14.80 లక్షలు మంజూరు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో నాచారం సర్కిల్ డివిజన్ అధ్యక్షులు నుతులకంటి రాజు, జెమిలా బేగం, SV కిట్టు, మహేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాప్రా సాయి గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నెమలి అనిల్, బాలరాజ్, పర్వతాలు, ఉపేందర్ రెడ్డి, విజయ్ రెడ్డి, కిషోర్ తదితరులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.