పీఎం విశ్వకర్మ యోజనతో రజకులకు ఆర్థిక చేయూత: బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు
నసురుల్లాబాద్ మండలంలోని నెమలి, మిర్జాపూర్ గ్రామాలకు చెందిన నలుగురు రజక కులస్థులకు పీఎం విశ్వకర్మ యోజన కింద ఆధునిక వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పీఎం విశ్వకర్మ యోజన ఆర్థికంగా తోడ్పాటునందిస్తోందని పేర్కొన్నారు.
పథకం ద్వారా లబ్ధి పొందిన సంకరం అంజయ్య, ధ్యామరంచ సాయిలు, చందురు సాయిలు, చాకలి జంపన్నలకు వాషింగ్ మెషీన్లను అందజేశారు. లబ్ధిదారులకు పథకం ద్వారా ప్రయోజనం చేకూరడం సంతోషకరమని చందూరి హన్మండ్లు అన్నారు.
వెనుకబడిన వర్గాలను, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఆధునిక పనిముట్లు శారీరక కష్టాన్ని తగ్గించడంతో పాటు ఉపాధిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం హయాంలో చేతివృత్తుల వారి శ్రమకు గుర్తింపు, గౌరవం దక్కాయని చందూరి హన్మండ్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు యంత్రాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. మండలంలోని అర్హులైన కుల వృత్తుల వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, ధనుంజయ్, నెమలి సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సాయిలు, బీజేవైఎం మండల అధ్యక్షుడు భాస్కర్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు గంగాధర్, బూత్ అధ్యక్షులు లక్ష్మణ్, శివకుమార్, పోస్టల్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, సునీత పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.