నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ లడ్డూ వేలం ఘనంగా నిర్వహణ
నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది.
మొదటి లడ్డూను మాణిక్యం రూ.3,44,444లకు దక్కించుకున్నారు. అనంతరం రెండో లడ్డూను మోహన్ రూ.2,75,000లకు వేలంలో సొంతం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అశ్విన్, ఎస్‌ఐ, ఇతర పోలీసు అధికారులు, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
వినాయకుడి నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డూ వేలం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా అద్భుతంగా జరగడంతో నిర్వాహకులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.