మహా గణపతి పూజా కార్యక్రమంలో బోడపట్ల ఉపేందర్ గౌడ్ – జీవన్ రావు దంపతులు
మేడిపల్లి, సెప్టెంబర్ 22
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల డివిజన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా గణపతి పూజా కార్యక్రమం మంగళవారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది.
ఈ పూజా మహోత్సవంలో బోడపట్ల ఉపేందర్ గౌడ్ – జీవన్ రావు దంపతులు తమ కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మహా గణపతికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి మహా హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా బోడపట్ల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ, “ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ప్రతి ఇంట సంతోషాలు నిండాలని ఆకాంక్షిస్తున్నాను. అందరూ కలసికట్టుగా ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలను జరుపుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం, ఐక్యత పెరుగుతాయి” అని తెలిపారు.
అనంతరం కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో హాజరైన కాలనీ వాసులు స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ ప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక నాయకులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.