ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్

37 అర్జీలు.. సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు

పవార్ వార్త, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రజావాణిలో సోమవారం 37 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఫిర్యాదుదారుల సమస్యలను విని, చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ అర్జీలను సమర్పించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో కమిషనర్ ఫోన్‌లో మాట్లాడి సమస్యల స్థితిని తెలుసుకున్నారు. పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.

ప్రజలకు అందుబాటులో పోలీసు సేవలు

ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకునేలా పోలీస్ శాఖ ప్రజలకు మరింత దగ్గరగా పనిచేస్తుందని తెలిపారు.

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పి. సాయి చైతన్య వెల్లడించారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి