ఒడిశా నుంచి తెలంగాణకు హషీష్ ఆయిల్.. ఇద్దరి అరెస్ట్ | Pawar Vartha
బ్రేకింగ్ న్యూస్ • హషీష్ ఆయిల్ పట్టివేత
PAWAR VARTHA • CRIME NEWS
మల్కాజిగిరి కమిషనరేట్
DRUGS BUST

ఒడిశా నుంచి తెలంగాణకు హషీష్ ఆయిల్.. ఇద్దరి అరెస్ట్

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో భారీగా హషీష్ ఆయిల్ పట్టుబడింది. ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న 14.2 కిలోల హషీష్ ఆయిల్‌ను ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ, నాగోల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.75 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పట్టుబడిన హషీష్ ఆయిల్
14.2 కిలోలు
అంచనా విలువ
₹1.75 కోట్లు
అరెస్టులు
2 మంది

ఘటనకు సంబంధించిన వీడియో

Pawar Vartha • Crime News Update

ఎక్కడ పట్టుకున్నారు?

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. యమహా MT-15 బైక్‌పై హషీష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన వ్యక్తులు

తల్లే నాగరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లా
నాగుల నారాయణ అలియాస్ కిరణ్
అల్లూరి సీతారామరాజు జిల్లా

వీరిద్దరూ పెడ్లర్ కమ్ ట్రాన్స్‌పోర్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్నవి

14 ప్యాకెట్లు 14.2 కిలోల హషీష్ ఆయిల్ 2 మొబైల్ ఫోన్లు Yamaha MT-15 బైక్ ₹2,500 నగదు

విచారణలో కీలక విషయాలు

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన తమరా గోపాల్ అనే వ్యక్తి నాగరాజు, నారాయణలకు చెరో 7 కిలోల హషీష్ ఆయిల్ ఉన్న రెండు బ్యాగులను అందించినట్లు పోలీసులు తెలిపారు.

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలించి అప్పగిస్తే ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇస్తానని గోపాల్ ఆఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

సరఫరా నెట్‌వర్క్

పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు గ్రామీణ రహదారుల మీదుగా హైదరాబాద్ వైపు వస్తుండగా నిందితులు పట్టుబడ్డారు.

తమరా గోపాల్
ప్రధాన సరఫరాదారు
➜
నాగరాజు
7 కిలోలు
+
నారాయణ
7 కిలోలు

ప్రధాన సరఫరాదారు పరారీ

నిందితులు గతంలో కూడా గంజాయి కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన సరఫరాదారు తమరా గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

ఈ ఘటనపై నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి.. హషీష్ ఆయిల్ సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

POLICE BYTE
“హషీష్ ఆయిల్ సరఫరా వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.”
— సి.పి. సుమతి
PAWAR VARTHA Crime • Telangana • Latest Updates
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply