బొల్లారం వద్ద అక్రమ ఆయుధాలు పట్టివేత | పవర్ వార్త
BREAKING NEWS
📍 బొల్లారం • మేడ్చల్–మల్కాజిగిరి
పోలీస్ యాక్షన్

బొల్లారం వద్ద అక్రమ ఆయుధాలు పట్టివేత
నిందితుడి అరెస్ట్

అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న వ్యక్తిని ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు, బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

నిందితుడు పర్భాన్స్ కుమార్
వయసు 27 సంవత్సరాలు
స్వస్థలం ఉత్తరప్రదేశ్
కేసు ఆర్మ్స్ యాక్ట్
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
🔴 2 × 9mm పిస్టల్స్
🔴 3 × మ్యాగజైన్లు
🔴 17 × లైవ్ రౌండ్లు
🔴 1 × డబుల్ బ్యారెల్ తపంచా
🔴 2 × లైవ్ రౌండ్లు
పోలీసుల వివరాల ప్రకారం

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పర్భాన్స్ కుమార్ అక్రమంగా డ్రై గంజాయి, గంజాయి చాక్లెట్ల విక్రయానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2024లో చెర్లపల్లి పోలీసులు అతడిని గంజాయి కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


అనంతరం తుపాకులు, తపంచాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరలకు విక్రయించాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 10న ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సోను అనే వ్యక్తి నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

అరెస్ట్ ఎలా జరిగింది?

ఆగస్టు 22న మధ్యాహ్నం 12:10 గంటల సమయంలో బొల్లారం బంగ్లా నంబర్ 13, సాధన మందిర్ సమీపంలో పర్భాన్స్ కుమార్ కదులుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.


దీంతో ఎస్‌ఓటీ మల్కాజిగిరి జోన్ పోలీసులు, బొల్లారం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పర్భాన్స్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

🎥 ఘటనకు సంబంధించిన వీడియోలు

4 VIDEOS
VIDEO 01
బొల్లారం వద్ద పోలీసుల చర్య
VIDEO 02
పోలీసుల స్వాధీనం చర్యల దృశ్యాలు
VIDEO 03
ఘటనకు సంబంధించిన మరిన్ని దృశ్యాలు
VIDEO 04
బొల్లారం పోలీసుల ఆపరేషన్ దృశ్యాలు
ℹ️ ఈ వీడియోలు వార్తా కథనంలో భాగంగా సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడ్డాయి.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply