నారాయణపేట జిల్లాలో కృష్ణజింక వేట.. మాంసం తరలిస్తున్న 9 మంది అరెస్ట్

నారాయణపేట: నారాయణపేట జిల్లాలో కృష్ణజింకను వేటాడి, దాని మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉట్కూర్ మండలం లక్ష్మీపల్లి అటవీ ప్రాంతంలో కృష్ణజింకను తుపాకులతో వేటాడినట్లు పోలీసులు గుర్తించారు. షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు.

కృష్ణజింకను వేటాడి హైదరాబాద్‌కు తరలిస్తుండగా..

లక్ష్మీపల్లి అటవీ ప్రాంతంలో కృష్ణజింకను తుపాకులతో వేటాడి, దాని తల, కాళ్లు తొలగించిన అనంతరం మాంసాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల సమాచారం. షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో ఉట్కూర్ మండలానికి చెందిన రియాజ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన మరో ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

13 కిలోల జింక మాంసం, తుపాకీ స్వాధీనం

నిందితుల నుంచి 13 కిలోల జింక మాంసంతోపాటు ఒక తుపాకీ, 19 బుల్లెట్లు, స్కార్పియో వాహనం, ఎనిమిది సెల్‌ఫోన్లు, ఒక కెమెరా, రూ.28,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply