షెట్‌పల్లిలో రూ.30 లక్షలతో గోదాం నిర్మాణం: ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవ
ఎల్లారెడ్డి నియోజకవర్గం
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్‌పల్లి గ్రామంలో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన గోదాం నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో ఈ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు రైతులకు అవసరమైన నిల్వ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.
నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం గోదాం అందుబాటులోకి రావడంతో స్థానిక రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామ అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.