మహబూబ్నగర్ జిల్లా
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగులో అక్రమంగా ఇసుక తవ్వి, తరలిస్తున్న సంఘటనను రైతులు అడ్డుకున్నారు. ఈ ఇసుక రవాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోదరుడు, అతని అనుచరుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుచరులైన రవి, రవికాంత్ రెడ్డి అడ్డగోలుగా ఇసుక తవ్వి తరలిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని రైతులు నిలదీశారు.
ఇసుక లారీలను అడ్డుకోకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నట్లు రైతులు ఆరోపించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే ఇసుక దందా నడుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.
















