తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ.. నీటి వాటాపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్‌ఎస్
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల తరహాలో రాష్ట్ర సమస్యలు, ముఖ్యంగా నీటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ తరఫున వాదనలు వినిపించారు. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నీటిని తరలించారని పేర్కొన్నారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి వెలుగంగ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు తరలిపోతున్నాయని ఆరోపించారు.
మహబూబ్‌నగర్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారుతాయని, తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కార్యక్రమంలో పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపామని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు అందించామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాల్లో పొంగిపొర్లాయని పేర్కొన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ సమస్యను తరిమికొట్టామని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో ఎడమ కాల్వ గేట్లను ఓపెన్ చేసిన తర్వాత కుడి కాల్వ గేట్లు ఓపెన్ చేసేవారని, కాంగ్రెస్ హయాంలో మాత్రం కుడి కాల్వ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఎడమ కాల్వ గేట్లు ఓపెన్ చేస్తున్నారని కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
కన్నెపల్లి నుంచి వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిశాయని, ఇప్పటికే 150 TMCల నీళ్లు సముద్రంలో కలిశాయని కూడా పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.